![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -288 లో.. మురారి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ముకుంద దూకుడు గురించి భయపడుతున్నానురా, ఎక్కడ కృష్ణకి నిజం చెప్తుందేమోనని భయపడుతున్నానురా అంటూ తన ఫ్రెండ్ తో మురారి చెప్పగా.. ఎందుకు రా టెన్షన్ ఇదంతా నువ్వు కృష్ణని ప్రేమిస్తున్నట్లు చెప్పకపోవడం వల్ల వచ్చిందని మురారితో తన ఫ్రెండ్ చెప్తాడు.
మరొకవైపు ఆ ఫేక్ కమాండర్ కోసం మధు వెతుకుతుంటాడు. ఇక కాసేపటికి అతను దొరుకుతాడు. అతడిని ఇంటికి తీసుకొస్తాడు మధు. ఆ తర్వాత ముకుంద తన గదిలో ఉండి ఫోన్ చూస్కుంటుంది. అందులో గీతిక కాల్ చేసినట్టుగా రిసీవ్డ్ కాల్స్ లో ఉంటుంది. అది చూసి నేను మాట్లడలేదు కదా ఎలా ఉంది, ఎవరు మాట్లాడారనే డౌట్ తో కృష్ణ దగ్గరికి వచ్చి.. నా ఫోన్ టచ్ చేసావా అని కృష్ణని అడుగుతుంది. కాసేపు ఆగు నీకే తెలుస్తుందని ముకుందతో కృష్ణ చెప్పేసి వెళ్లిపోతుంది. ఇక మధు ఆ ఫేక్ కమాండర్ ని భవాని దగ్గరికి తీసుకెళ్ళగా.. అతను భవాని కాళ్ళ మీద పడి క్షమించండి అని అంటాడు. ఏమైందని అడుగగా.. నేను సినిమాల్లో, సీరియల్స్ లలో చిన్నా చితక వేషాలు వేసుకునే వాడిని ఆ మేడమ్(ముకుంద) వచ్చి నన్ను కమాండర్ వేషం వేయమని చెప్పింది. ఏసీపీ సర్ వచ్చినప్పుడు మేడమ్ ఏం చెప్పమన్నారో అదే చెప్పాను మేడమ్ అని ఆ ఫేక్ కమాండర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక భవాని రియలైజ్ అయి ముకుంద దగ్గరికి వెళ్ళి తన చెంప చెళ్లుమనిపిస్తుంది. ఛీ నిన్ను పేరు పెట్టి పిలవాలన్న అసహ్యంగా ఉంది. మాట్లాడు అని భవాని అనగానే..ఆదర్శ్ అంటే ఇష్టం లేక అని ముకుంద చెప్తుంది. మరి ఆదర్శ్ అంటే ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్ళి చేసుకున్నావని, ఈ మాటేదే అప్పుడే చెప్పొచ్చు కదా అని భవాని అడుగుతుంది. చెప్పాను కానీ నా గొంతు నొక్కేశారు. నా మనసు చచ్చినా నా ప్రేమ బ్రతికే ఉంటుందని చేసుకున్నానని ముకుంద అంటుంది. " ప్రేమేంటి బ్రతికుండటమేంటి? ఏంటి ఈ చెత్త వాగుడు, ఛీఛీ పెళ్ళి అయ్యాక ప్రేమేంటి? ఇది ఏం మాట్లాడుతుంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ప్రేమ గురించి మాట్లాడటమేంటి? ఛీఛీ ఏంటీ అసహ్యం.. లేదు, నువ్వు ఈ ఇంట్లోనే ఉంటే ఇంకా ఛండాలం చేస్తావ్. ఇప్పుడే మీ నాన్నకి ఫోన్ చేసి నిన్ను తీసుకెళ్ళమని చెప్తాను" అని భవాని వెళ్తుండగా.. తనని ఆపుతుంది ముకుంద.
అలా మా నాన్నకి చెప్పేముందు నేను చెప్పేది ఒకసారి వినండి. విన్న తర్వాత ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాని ముకుంద అనగానే.. షటప్ నా విజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చదువు విజ్ఞత గురించి కృష్ణ దగ్గర నేర్చుకోమని ముకుందతో భవాని అనగానే.. నేను తన దగ్గర నేర్చుకోవాలా? ఇంత దాకా వచ్చాకా నిజం చెప్పేస్తాను. వాళ్ళిద్దరు అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకొని వచ్చారు. ఈ రేవతి వాళ్ళిద్దరు అలా చేసినా ఒకే గదిలో ఉంచి కాపురం చేపించాలని చూస్తుంది. అందరు మీ వెనుక నాటకం ఆడుతున్నారని, మిమ్మల్ని మోసం చేస్తున్నారని ముకుంద అనగానే.. ఆ నిజం తట్టుకోలేక భవానికి కళ్లు తిరిగి పడిపోతుండగా.. అందరు పట్టుకోవడానికి వస్తే వద్దని చెప్తుంది. నేను మురారి ప్రేమించుకున్నాం. కుటుంబం, పరువు అంటూ మురారి నన్ను ఆదర్శ్ తో పెళ్ళికి ఒప్పించాడని భవానితో అంటుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |